నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత..!

-

సమంత తాజాగా శాకుంతలం సినిమా కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సమంత చేసిన ఇంటర్వ్యూ నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది.. సమంత తన ఆరోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం తాను ఎలా ఉంటున్నానో కూడా అభిమానులతో పంచుకుంది. ఇకపోతే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా షూటింగ్లు చేయడమే ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే సమంత ఇప్పుడు ఒక అభిమానితో చెప్పిన విషయం మాత్రం అందరిని ఆకట్టుకోవడమే కాదు అంతకుమించి నవ్విస్తోంది కూడా.

మీడియాలో సమంత ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంతే కాదు ట్రోలర్లకు ఎలా రియాక్ట్ అవుతుందో.. తన ఫాన్స్ పెట్టే పాజిటివ్ ట్విట్లకు ఎలా స్పందిస్తుందో అందరికీ తెలుసు. అయితే ఇటీవల సమంతను ఒక నెటిజన్ డేటింగ్ చేయమంటూ ఒక సలహా ఇచ్చారు. ఇది నేను చెప్పాల్సిన విషయం కాదు.. కానీ మీరు ఎవరితోనో ఒకరితో డేటింగ్ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చాడు.. అయితే సమంత ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చింది. నీకంటే బాగా నన్ను ఇంకెవరు ప్రేమిస్తారు అని ఎంతో సరదాగా చెప్పింది. అయితే ఈ ట్వీట్ కి మాత్రం విపరీతమైన స్పందన లభిస్తోంది. మేము రెడీ అంటూ సమంత అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే సమంత తన శాకుంతలం సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. కేజీల చొప్పున నగలు ధరించి సినిమా షూటింగ్ చేసింది. ఇంటర్వ్యూలో తాను ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడింది .. ఎలాంటి వర్క్ అవుట్ లు చేసింది.. ఎలాంటి డైట్ మెయింటెన్ చేసింది.. అన్న ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పింది. ఇకపోతే సినిమా స్క్రిప్ట్ తన వద్దకు వచ్చినప్పుడు బాడీ బిల్డింగ్ చేసి మజిల్స్, యాబ్స్ వచ్చాయట. కానీ శాకుంతల పాత్ర కోసం పూర్తిగా తగ్గిపోవాలని.. సాఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యిందంట ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత చాలా ప్రయత్నాలు చేసి ఆ తర్వాత ఈ స్టేజి కు వచ్చాను.. చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news