ఆర్‌సీ15 టైటిల్ అవుట్..

-

ఆర్‌సీ15 టీం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించేసింది చిత్ర బృందం..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆర్‌సీ15. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ అమెరికాకు వెళ్లడంతో కొంత గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే మళ్లీ షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా రాంచరణ్ కు సెట్ లో గ్రాండ్ వెల్కమ్ పలికింది చిత్ర బృందం. వీటితో పాటు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా రెండు రోజులు ముందే జరిపించేశారు. కాగా ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించేసారు. టైటిల్‌కి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకి `గేమ్‌ ఛేంజర్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

 

ఈ సినిమాకు సర్కారోడు, సీఈవో వంటి టైటిల్స్ ప్రచారంలో ఉండగా ఊహించని టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు కేజీ అప్డేట్స్ రాబోతున్నాయని దిల్ రాజు ప్రకటించగా టైటిల్ అనౌన్స్ చేసిన చిత్ర బృందం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈరోజు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కీరా అద్వాని నటిస్తుంది. శ్రీకాంత్,అంజలి, సునీల్ కీలకపాత్రలో నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news