సమంత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సమంత కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. సమంత కేవలం తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించడానికి సమంత ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అలాగే బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్ట్ లకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న సమంత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రాకముందు పెద్దపెద్ద ఫంక్షన్ లకు హాజరయ్యే గెస్ట్ లకు వెల్కమ్ చెప్పే అమ్మాయిగా సమంత వెళ్లలేదట, రోజుకు 500 రూపాయలు ఇచ్చేవారట.
ఒకానొక సమయంలో డబ్బులు లేక రోజులో ఒక్క పూట భోజనంతో జీవితంను గడిపిందట. కేవలం ఒక్క పూట భోజనంతో దాదాపు రెండు నెలల పాటు గడిపినట్టుగా తెలిపింది సమంత. తల్లిదండ్రుల కోరిక మేరకు చదివి నేను టాపర్ గా నిలిచే దాన్ని, కాని డబ్బులు లేని సమయంలో డిగ్రీలో జాయిన్ అవ్వలేక చదువును వదిలేశాను అని సమంత చెప్పుకొచ్చింది. మోడలింగ్ వైపు వెళ్తున్న సమయంలో కూడా మొదట్లో కొందరు తనను విమర్శించినట్లు తెలియజేసింది. కుటుంబంలో కొంతమంది అవసరమా అనే వారట. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ముందు అడుగు వేశాను అని సమంత తెలియజేసింది. ఇలా ఒకానొక సమయంలో అనేక కష్టాలను అనుభవించిన సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది.