అంగన్ వాడీ టీచర్లకు కెసిఆర్ శుభవార్త.. త్వరలోనే ప్రమోషన్లు

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడి టీచర్ల కు టిఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకృత శిశు సంక్షేమ ప్రాజెక్టు… కింద అంగన్ వాడి… సూపర్వైజర్ ల పోస్టులను భర్తీ చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ టీచర్లలో అర్హులైన వారికి ఈ పోస్టులో పదోన్నతి కల్పించనుంది కేసీఆర్ ప్రభుత్వం.

ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ.. ప్రతిపాదనలను తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపింది. ఈ సూపర్ వైజర్ పోస్టులు దాదాపు 350 వరకు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

పదో తరగతి ఉత్తీర్ణులై మరియు కనీసం పదేళ్ల అనుభవం ఉన్న అంగన్ వాడి… టీచర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల ప్రక్రియ పై… మరో నెల రోజుల్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల పై… అధికార ప్రకటన చేసి… రాత పరీక్ష ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇంకా తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై అంగన్వాడీ టీచర్లు… హర్షం వ్యక్తం చేస్తున్నారు.