పెళ్లి తర్వాత మెచ్యూర్ క్యారెక్టర్లు, పవర్ ఫుల్ రోల్స్ అని డైలాగులు చెప్పిన సమంత ఇప్పుడీ మాట తప్పుతోందా.. అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. కెరీర్ కాపాడుకోవడానికి హాట్ లుక్స్ రిలీజ్ చేస్తోందని కామెంట్ చేస్తున్నారు.
సమంత పెళ్లి తర్వాత పవర్‌ఫుల్ రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పింది. హీరోయిన్ రోల్‌కి ఇంపార్టెన్స్ ఉంటేనే కాల్షీట్స్ ఇస్తానంది. ఈ రూట్‌లోనే ‘యు టర్న్, మజిలీ, ఓ బేబీ’ లాంటి సినిమాలు చేసింది. కానీ సామ్ ఈ ట్రాక్ నుంచి బయటకువస్తోందనే ప్రచారం జరుగుతోంది. కెరీర్ కోసం మళ్లీ గ్లామర్‌గిరీలోకి దిగుతోందని కామెంట్ చేస్తున్నారు. సమంత పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలు తగ్గించింది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ ప్రిఫర్ చేసింది. మధ్యలో భర్తతో కలిసి ‘మజిలీ’ సినిమా చేసింది. కానీ ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ పెద్దగా సక్సెస్ కాట్లేదు.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అన్నీ దెయ్యాలు, మర్డర్ మిస్టరీల చుట్టే తిరుగుతున్నాయి. దీంతో సమంత మళ్లీ కమర్షియల్ సినిమాలపై ఫోకస్ పెడుతోందని టాక్ వస్తోంది. సమంత రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హాట్ ఫోటో షేర్ చేసి, తెలుగు రాష్ట్రాలని ముంచెత్తున్న తుఫాన్‌ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. ఈ హాట్ స్టిల్‌తో నేను గ్లామర్ రోల్స్‌కి రెడీ అన్నట్లు మేకర్స్‌కి హింట్స్ ఇచ్చింది. నెటిజన్ల నుంచి మాత్రం వందలకొద్ది కామెంట్లు, ఫైర్ ఎమోజీలు వస్తున్నాయి.