‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కు సమంత!

అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లూ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అక్కినేని ఫాన్స్ ఇటు సమంత ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఇప్పుడిప్పుడే… నాగచైతన్య మరియు సమంత ఆ బాధ నుంచి బయట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత బుల్లి తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ ఫస్ట్ గా వస్తున్నా ఎవరు మీలో కోటీశ్వరులు షో కు సమంత గెస్ట్ గా వచ్చింది.

ఈ మేరకు సమంత గెలుచుకున్న మొత్తం, వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఏకంగా 25 లక్షలు సమంత గెలుచుకున్న ట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ మొదటి రోజు రాగా ఈ వారంలోనే మహేష్ బాబు కూడా రాబోతున్నాడు.

సమంతతో నేడు షూట్ చేసిన ఎపిసోడ్ వచ్చేవారం ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షో లో విడాకుల విషయం పై సమంత ఏదైనా కామెంట్లు చేసిందా అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో ఈ షో ఎప్పుడు ప్రసారం అవుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.