వాటికి దూరంగా ఉంటా.. ప్రేమపై సమంత షాకింగ్ కామెంట్స్

-

ఏ మాయ చేసావే అంటూ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన సమంత.. తక్కువ సమయంలోనే తమిళంలోనూ రాణించింది. దాదాపు తెలుగు, తమిళంలోని అగ్రహీరోలతో సినిమాలు చేసి అగ్రతారల జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే తెలుగులో తాను మొదట నటించిన సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడ్డ సమంత.. 2017 అక్టోబర్‌లో నాగచైతన్యను వివాహం చేసుకుంది.

కానీ ఆరు నెలల కింద ఈ జంట విడాకులు తీసుకుంది. అయితే… తాజాగా సమంత తన కెరీర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌ తో ఇంటరాక్ట్ అయింది సామ్‌. ఈ నేపథ్యంలోనే… ఓ అభిమాని.. ప్రేమను, ద్వేషాన్ని ఒకేసారి పొందుతున్నారు ఎలా అనిపిస్తోంది అని బాంబ్‌పేల్చాడు. అయితే.. దీనికి సమంత బదులిస్తూ… ప్రేమను కానీ, ద్వేషాన్ని కానీ. నేను కొనాలని అనుకోవట్లేదు. వాటికి దూరంగా సేఫ్‌ గా ఉండాలని అనుకుంటున్నాను అని సమంత హాట్‌ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news