ప్రస్తుతం తగ్గేది లేదని అంటున్న సమంత.!

-

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆమె న్యూస్ లేకుండా సినిమా న్యూస్ వచ్చిన దాఖలాలు లేవు. ఇక ఆమె ఎప్పుడైతే అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుందో అప్పటి నుండి మీడియా లో ఇంకా హంగామా ఎక్కువ అయ్యింది.

ప్రస్తుతం విజయ్ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో ,సమంత  హీరోయిన్ గా ఖుషి అనే సినిమా చేస్తోంది. ప్రస్తుతం సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల షూటింగ్ కూడా సాధ్యం కావడం లేదు ఇక ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇక ఖుషి సినిమా విషయంలో ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. సమంత ను తీసి కొత్త హీరోయిన్ ను పెట్టబోతున్నారు అని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి.

దీనిపై యూనిట్ వర్గాలు ఎవరూ ఖండించడం కూడా చేయలేదు. ఇక రీసెంట్ గా సమంత వర్క్ అవుట్ చేస్తూ ఫిట్ గా మారేందుకు తనని తాను మలచు కొంటోంది. అలాగే ఫ్రెండ్స్ తో కలిసి పోయి చిట్ చాట్ చేస్తూ హెల్త్ రికవరీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇక సమంత కూడా సూపర్ ఫిట్ గా రెడీ అయ్యి డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తాజాగా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ చిత్ర షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ను ఇచ్చారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభిస్తాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news