Samantha: టాలీవుడ్ మోస్ట్ బ్యూటీపుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న చైతూ-సామ్ ల జంట. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ, సడెన్ గా వారి వివాహబంధానికి పుల్ స్టాప్ పెట్టారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సమంతను టార్గెట్ చేస్తూ.. అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ రూమర్స్ చెబుతూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. సమంత తిరిగి తన కెరీర్ పైన దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
పెళ్లి తర్వాత అనేక అవకాశాలను వదులుకున్నది. ఈ క్రమంలో బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లను కూడా వదులుకుంది. ఫ్యామిలీ మాన్ 2 తర్వాత సామ్ కి అక్కడ భారీ ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిందట. కొత్త కథలను వింటుందట.
ఇప్పటికే శాకుంతలం చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సామంత.. తమిళ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇక కొత్తగా మరో మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అవి ఏయే భాషలకు సంబంధించిన సినిమాలనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే.. బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయట.
ఇందులో భాగంగా తనకు వచ్చిన క్రేజీ ఆఫర్‌ని సమంత అంగీకరించనున్నటు ప్రచారం నడుస్తుంది. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానున్నది. మరోవైపు తమిళ సినిమాలను చేయడానికి సిద్దంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. సాధ్యమైనంత త్వరగా కొత్త సినిమాలు స్టార్ట్ చేసి డైవర్స్ డిప్రెషన్ నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.