పండుగ పూట విషాదం : నదిలో పడ్డ బస్సు.. 32 మంది మృతి

పండుగ పూట… విషాదం చోటు చేసుకుంది. నేపాల్ దేశంలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడి పోవడం తో ఏకంగా 32 మంది ప్రయాణికులు మృతి చెందారు. 32 మంది వృత్తి తో పాటు మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘోర ప్రమాదం ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మంగళవారం నేపాల్ గంజి నుంచి ముగ్ జిల్లా.. కేంద్రమైన గంగాది వైపు నాకు వెళ్తున్న ఓ బస్సు ఛాయా నాథ్ రారా మున్సిపాలిటీ లో ఉన్న పినా జారీ నదిలో బస్సు పడి పోయింది. ఏకంగా 300 అడుగుల లోతులో ప్రమాదవశాత్తూ పడిపోయింది ఆ బస్సు. దీంతో … అక్కడికక్కడే ఏకంగా 32 మంది ప్రయాణికులు మరణించారు.

మరికొంత మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ సొంత ఊర్లకు బస్సు లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా ఈ ప్రమాదం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యల కోసం రంగంలోకి ఆర్మీ నింపారు. గాయపడ్డ వారిని.. ఆస్పత్రికి తరలించారు ఆర్మీ అధికారులు.