శాకుంతలం నష్టాలు పూడ్చటానికి షాకింగ్ డెసిషన్ తీసుకున్న సమంత!

-

samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శకుంతలం సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిం.ది ఈ సినిమాను విజయవంతం చేయటానికి చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నాలు జరిపినప్పటికీ ఆ ప్రయత్నాలు అన్ని బెడిసి కొట్టాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ సినిమా మినిమం గ్రాస్ ను అందుకోకపోవడం ఇబ్బంది కలిగించే విషయమే. అయితే ఈ డిజాస్టర్ తో నిర్మాతలు దిల్ రాజు, గుణశేఖర్ భారీగా నష్టపోయినట్టు తెలుస్తోంది. కాగా ఈ నష్టాలు కొంతైనా తగ్గించడానికి సమంత షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం.

శాకుంతలం సినిమా ఇండియన్ కల్చర్, మైథలాజికల్ తీరితో తెరకెక్కిన సంగతి తెలిసిందే. శకుంతలా, దుష్యంతుడి ప్రేమపై ఇప్పటికే ఎన్నో కథలు వచ్చినప్పటికీ శకుంతల చిత్రం మాత్రం విభిన్న రీతిలో కనిపించనిందని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురయింది. ఈ సినిమాను అభిమానుల అభిరుచికి తగినట్టు తెరకెక్కించలేకపోవటంతో సినిమా భారి డిజాస్టర్ గా మిగిలింది.

 

 

Samantha

కాగా ఈ సినిమా 80 కోట్ల బడ్జెట్ తో తెరెక్కుతున్ననట్టు వార్తలు వినిపించినప్పటికీ వాటిని ఖండించింది చిత్ర బృందం. సినిమాకు అయిన బడ్జెట్ 60 కోట్లుగా చెప్పకుంటూ వచ్చింది. కాగా ఇప్పటివరకు కనీసం 5, 6 కోట్లు కూడా రాకపోవడంతో నిర్మాతలు మాత్రం భారీ స్థాయిలో నష్టపోనున్నారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చటానికి సమంత తను ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి చేయటానికి సిద్ధపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సినిమాకి సమంత దాదాపు మూడు కోట్ల నుండి ఎనిమిది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు తెలియనప్పటికీ తీసుకున్న మొత్తం వెనక్కి ఇచ్చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version