జుక‌ల్క‌ర్ మ‌రో ఫ్రెండ్ తో క‌లిసి స‌మంత ఫారెన్ ట్రిప్..!

-

టాలీవుడ్ బ్యూటీ స‌మంత నాగ‌చైత‌న్య తో విడాకుల త‌ర‌వాత ఫుల్ గా చిల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సామ్ ఇటీవ‌ల త‌న స్నేహితుల‌తో క‌లిసి తీర్థ‌యాత్ర‌లు చేసింది. ఈ సంధ‌ర్బంగా సమంత ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక ఇప్పుడు స‌మంత త‌న స్టైలిష్ట్ మ‌రియు మ‌రో ఫ్రెండ్ తో క‌లిసి ఫారెన్ వెళుతున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ ఫోటోలో స‌మంత రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

అంతే కాకుండా జుక‌ల్క‌ర్ తాజాగా చేసిన మ‌రో పోస్ట్ తో ఇప్ప‌టికే స‌మంత త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి విమానంలో దుబాయ్ చేర‌కున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే త‌న‌పై యూట్యూబ్ ఛాన‌ల్లు చేస్తున్న త‌ప్పుడు క‌థ‌నాల‌పై స‌మంత కూక‌ట్ప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించింది. విడాకుల అనంత‌రం త‌న‌కు ఇత‌రుల‌తో సంబంధాలు అంట‌గ‌ట్ట‌డం త‌ప్పుడు వార్తలు ప్ర‌సారం చేయ‌డంపై నాలుగు యూట్యూబ్ ఛాన‌ల్లపై సమంత కేసులు పెట్టింది. కాగా ఆ వార్త‌లను తొల‌గించాలంటూ ఛాన‌ల్ల‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news