Samantha: ఆస్పత్రిలో బెడ్‌పైన సమంత..‘యశోద’ ఫస్ట్ గ్లింప్స్ ఔట్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..అక్కినేని నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. ‘పుష్ప’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సమంత..వినూత్నమైన స్టోరిలను ఎంచుకుని పిక్చర్స్ చేస్తోంది.

ఇటీవల ఆమె నటించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ ఫిల్మ్ రిలీజ్ మంచి పేరు సంపాదించుకుంది. కాగా, గురువారం సమంత నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘‘యశోద’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ తో సినిమాపైన అంచనాలు ఇంకా పెరిగాయని చెప్పొచ్చు.

హ‌రీ, హ‌రీష్‌ దర్శకత్వం వహిస్తున్న వ‌హిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల కానుంది. కాగా, గ్లింప్స్ లో సమంత..ఓ ఆస్పత్రి బెడ్ పై నుంచి అప్పుడు బయటకు వచ్చి కిటికీలోనుంచి పావురాన్ని ముట్టుకోబోతుంది. అంతటితో గ్లింప్స్ ముగుస్తుంది. అలా గ్లింప్స్ తో పిక్చర్ పైన ఎక్స్ పెక్టేషన్స్ ను ఇంకా పెంచేశారు మేకర్స్.

ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్రలు పోషిస్తుండగా, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. పిక్చర్ ను శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news