టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన ‘రచ్చ’ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది. రామ్ చరణ్..కెరీర్ లోనే డిఫరెంట్ ఫిల్మ్ గా అది నిలిచింది. కాగా, సంపత్ నంది..ఆ తర్వాత పలువురు హీరోలతో సినిమాలు తీశారు. కాగా, తాజాగా మరోసారి మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టారు.
ఈ సారి మరో మెగా హీరో సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ తో భారీ బడ్జెట్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ తీయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరిని సాయి ధరమ్ తేజ్ ఓకే చేసినట్లు టాక్.
ఈ ఫిల్మ్ ను సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ప్రొడ్యూస్ చేయబోతున్నారని వినికిడి. సాయి ధరమ్ తేజ్ ..తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘రిపబ్లిక్’ సినిమాలో కనిపించాడు. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.