ఈ సినిమా ఫ్లాప్ అయిందంటే.. మెగా హీరో కెరీర్ అంతేనా..?

-

మెగాస్టార్ మేనల్లుడు చిన్న వయసు నుంచే పలు సినిమాలలో నటించి ఆ తర్వాత ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోగా మారిపోయారు వైష్ణవ తేజ్. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి.. మంచి పొజిషన్లో ఉంది అని చెప్పవచ్చు.. ఇక ఆ తరువాత డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం అనే సినిమాలో వైష్ణవి తేజ్ నటించి విడుదల చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.

ఇకపోతే తాజాగా తన మూడవ సినిమా “రంగ రంగ వైభవంగా ” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గిరీశాయ డైరెక్షన్లో బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటోంది.Vaishnav Tej's Ranga Ranga Vaibhavanga is a Political Drama

ఇక ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నది. ఇక ఈ సినిమాలో వీరిద్దరూ మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మంచి విజయాన్ని సాధిస్తేనే ఈ నటుడిపై ఉన్న ఫ్లాప్ గండం నుంచి బయటపడగలరు. ఇక ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే తన పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్ని కలిసి వచ్చి ఈ సినిమా హిట్ అయిందంటే చాలు.. హీరో కెరీర్ పరంగా మంచి క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు.Ranga Ranga Vaibhavanga Mp3 Songs Free Download 2022 Telugu

దీంతో పలు సినిమాలలో నటించే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి.. లేకపోతే ఇక ఈ హీరో కెరియర్ నిలబడడం కష్టమే అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఏమవుతుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news