పేరుకు పెద్ద దున్నపోతు, కానీ చిన్న పోతుతో కూడా తలపడే దైర్యం లేదు అనే నానుడి ఉందట.. ఈ సమయంలో ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేయవలసి వచ్చిందంటే ఎక్కడెక్కడి నుండో కరోనా రోగులను గాంధీ హస్పటలకు తరలిస్తున్నారు గానీ అక్కడ ఉన్నవసతుల గురించి ఆలోచించే వారే లేరట.. ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలు కోవిడ్‌తో 19తో మనోజ్ అనే రిపోర్టర్ మరణించాక గానీ బయటకు రాలేదు.. ఇక ఇతని మరణం మీడియాలో కలకలం రేపుతోంది. కాగా మనోజ్ మరణించడానికి ముందు చేసిన చాటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదేమంటే కరోనా వైరస్ మూలంగా వచ్చే రోగులను ఆస్పత్రిలో వైద్యులు ఇతర సిబ్బంది పట్టించుకోవడం లేదని, కనీసం ఆక్సిజన్ పెట్టడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు ఐసీయూలో కూడా పరిస్థితులు సరిగా లేవని వాపోతూ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న దుస్థితిని వీడియోలతో సహా బయటపెట్టారు.
ఇక గాంధీ ఆస్పత్రిలో ఉన్న డొల్లతనం మనోజ్ మేసేజ్‌తో బహిర్గమైంది. కరోనాతో మృతి చెందిన మనోజ్ వయసు 33 సంవత్సరాలు. కాగా ఆయన జూన్ 4న కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్స చేసినా పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా కాటుకు బలైపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 14 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. అంతే కాకుండా తెలంగాణలో కోవిడ్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారనే టాక్ ఉంది. ఇక చేస్తున్న ఆ పరీక్షల్లో పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటోందట.. కాగా ప్రస్తుతం కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ దశలో ప్రభుత్వంపై పలువురు విమర్శలు కూడా గుప్పిస్తున్నారట.. ఏది ఏమైనా ఇప్పుడే పరిస్దితి ఇంత దారుణంగా ఉంటే రాబోయే రోజుల్లో ఉండే దుస్దితిని అంచనా వేయడం చాలా కష్టమని తెలుస్తుంది.. ఇక ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలి..