విరూపాక్ష మూవీ టీం పై సీరియస్ అవుతున్న సంయుక్త మీనన్..!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో జెడ్ స్పీడుతో దూసుకుపోతున్న అందాల భామ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ భీమ్లా నాయక్ సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సంయుక్త మీనన్ ఆ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ధనుష్ హీరోగా వచ్చిన సార్ సినిమాలో హీరోయిన్గా నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దీంతో తెలుగులో సంయుక్త మీనన్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సంయుక్త తెలుగులో సాయి ధరంతేజ్ జోడిగా విరూపాక్షా సినిమాలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ విషయంలో సంయుక్త డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొనడం విశేషం.. ఇకపోతే డిసప్పాయింట్ ఎందుకు అయ్యాను అనేది చెప్పడానికంటే ముందు విరూపాక్ష సినిమా జర్నీ పై సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది.

ఇకపోతే తాను డిసప్పాయింట్ అవ్వడానికి గల కారణాలు తెలియజేస్తూ.. ఉగాదికి తన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేశారు. అయితే ఎక్కడ ఉంది ఆ పోస్టర్ అంటూ ప్రశ్నించింది. సంయుక్త మీనన్ పబ్లిక్ ట్విట్టర్ ద్వారా తమను ప్రశ్నిస్తుంది అని కార్తీక్ దండు అంచనా వేయలేదేమో.. ఇకపోతే టాలీవుడ్ లో హీరోయిన్స్ ఎవరూ కూడా స్టార్ హీరోలకి జోడి కట్టినప్పుడు తమ పోస్టర్స్ రిలీజ్ చేయకపోతే పెద్దగా ప్రశ్నించరు.. కానీ సంయుక్త దీనిపై విరుద్ధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news