చాలా మందికి వారికి నచ్చిన స్కీములలో డబ్బులు పెడుతూ వుంటారు. ఇలా డబ్బులని పెడితే మంచిగా లాభాలని పొందొచ్చు. కేంద్రం తీసుకు వస్తున్న స్కీముల్లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. 2015 నుంచి ఈ పథకం అమలులో వున్నది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రెగ్యులర్‌గా ఆదాయం పొందాలని అనుకుంటే ఈ స్కీమ్ బాగుంటుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు ఇందులో చేరచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..
60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి ప్రతి నెలా పెన్షన్ ని ఈ స్కీమ్ తో పొందొచ్చు. ప్రతి నెలా పెన్షన్ వస్తుంది మీకు. నామినీకి ఒకేసారి భారీ మొత్తం వస్తుంది. నెలకు రూ. 1000, రూ. 2 వేలు, రూ. 3 వేలు, రూ. 4,000, రూ. 5 వేలు చొప్పున ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ ని పొందొచ్చు. అయితే పెన్షన్ మీరు ఎంచుకునే పెన్షన్ ఆప్షన్ ఆధారంగా ఉంటుంది.
ఒకవేళ వ్యక్తి మరణిస్తే అప్పుడు నామినీకి పూర్తి డబ్బులు ఇచ్చేస్తారు. ప్రతీ నెలా కూడా పెన్షన్ వస్తోంది. స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే.. భాగస్వామికి ఆ పెన్షన్ మొత్తంలో సగాన్ని ఇస్తారు. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే అప్పుడు నామినీ కి స్కీమ్ డిపాజిట్ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల ముగ్గురికీ ప్రయోజనం ఉంటుంది.
18 ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే 42 ఏళ్ల పాటు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది. నెలకు రూ. 42 చెల్లిస్తే చాలు. ప్రతి నెలా రూ.1000 పెన్షన్ వస్తుంది. సబ్‌స్క్రైబర్ మరణం తర్వాత నామినీకి ఒకేసారి రూ. 1.7 లక్షలు వస్తాయి. రూ. 2 వేలు పెన్షన్ ని పొందాలంటే నెలకు రూ. 84 కట్టాల్సి వస్తుంది. సబ్‌స్కైబర్ మరణించిన తర్వాత నామినీకి రూ. 3.4 లక్షలు వస్తాయి.