‘శాకుంతలం’లో తన పాత్ర గురించి సమంత ఇంట్రెస్టింగ్ పోస్టు

-

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా సామ్ తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందులో శాకుంతలం చిత్రంలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది సమంత.

“శకుంతల. ఆమెకు చాలా నమ్మకాలు ఉన్నాయి.. తన ప్రేమలో.. తన భక్తిలో ఎప్పుడూ నిజాయితీగానే ఉంటుంది. తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఆమె దయ.. గౌరవంతో భరించింది. తనను బాధించిన అనేక సంఘటనలను నమ్మకంతో ఎదుర్కొంది. ఆమె యువరాణి. అడవి.. జంతువుల పాత్రలు నాలోని చిన్నపిల్లను గుర్తుచేశాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో శకుంతల పాత్ర పోషించినందుకు. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది” అంటూ చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు.. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news