చీరకట్టులో మరింత అందంగా ఆకట్టుకుంటున్న సంయుక్తా మీనన్..!

-

ప్లాటినం లెగ్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా ఎందుకు అంటున్నామంటే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఏకంగా 5 తెలుగు సినిమాలలో అవకాశం అందుకొని.. ఆ ఐదు సినిమాలతో భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మను ఇక ఇలా పిలవడమే బెటర్ అని చెప్పాలి తాజాగా ఈమె సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్షా సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 21న అంటే రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఈమె కూడా పలు ప్రమోషన్స్ లో పాల్గొంటూ యువతను ఆకట్టుకుంటుంది. మరొకవైపు గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది.

ఇకపోతే డార్క్ ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న విరూపాక్షా సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలై.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో విజువల్స్, సౌండ్ అదరగొట్టేసాయి. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త ఒదిగిపోయి మరి నటించింది. కొత్త దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమా ఓటి టీ స్ట్రీమింగ్ రైట్స్ ని కూడా ప్రముఖ ఓ టీ టీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఇకపోతే థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది..ఇకపోతే ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ మరీ ఎక్కువగా ఫోటోలను షేర్ చేస్తుందని చెప్పాలి. తాజాగా కేరళ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. వైట్ కలర్ సారీ విత్ గోల్డెన్ కలర్ లేస్ తో చాలా అద్భుతంగా డిజైన్ చేసిన సారీ ని చాలా సింపుల్గా ధరించి అంతకుమించి అందంగా నేచురల్ లుక్ లో కనిపించింది ఏది ఏమైనా సంయుక్త అందాలకు మరొకసారి యువత ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news