సంజ‌న‌కు మ‌ళ్లీ షాకిచ్చిన క‌ర్ణాట‌క కోర్టు!

-

క‌న్న‌డ న‌టి సంజ‌న గ‌ల్రానికి బెంగ‌ళూరు కోర్టు మ‌రోసారి షాకిచ్చింది. బెయిల్ పిటీష‌న్‌ని తిర‌స్క‌రించింది. ఇటీవ‌ల సంజ‌న గ‌ల్రాని, రాగిణి దివ్వేది డ్ర‌గ్ రాకెట్ కార‌ణంగా అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌ణ అగ్ర‌హార జైలులో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీని సంజ‌న‌, రాగిణి దివ్వేది అనుభ‌హ‌విస్తున్నారు.

సంజనా డ్రగ్స్ సేకరించి వాడింద‌ని ఆరోపణలను ఎదుర్కొంటోంది. పార్టీలలో డ్రగ్స్ విక్రయించే డ్రగ్ రాకెట్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని బెంగళూరు పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే సంజ‌న మాత్రం త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని చెబుతోంది. ఇటీవ‌ల బెయిల్ కోసం ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డిన సంజ‌న తాజాగా మ‌రోసారి తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’, పవన్ కళ్యాణ్ న‌టించిన‌ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి పలు తెలుగు చిత్రాలలో సంజన న‌టించింది. గత రెండు నెలలుగా బెంగ‌ళూరులోని ప‌ర‌ప‌క‌ప‌ణ అగ్ర‌హార జైలులో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో వున్న సంజ‌న‌ బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news