ఇందిరా పార్క్ లో కలకలం రేపుతున్న గంధపు చెట్ల చోరీ..

-

జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక ఫేమస్ పార్క్ లో గంధపు చెట్ల చోరీ కలకలం రేపుతోంది. నిన్న ఇందిరా పార్క్ లో ఏపుగా పెరిగిన గంధం చెట్లని అర్ధ రాత్రి సమయాన నరికేశారు. సుమారు 13 గంధం చెట్లని కట్టర్ తో రాత్రికి రాత్రే కట్ చేసి ఎత్తుకుపోయారు. ఆదివారం చెట్లను నరికి వేశారు. అయితే ఇందిరా పార్క్ సిబ్బంది వాటిని గుర్తించారు. కానీ మరుసటి రోజు నరికివేసిన చెట్లు కూడా మాయం అయ్యాయి. దీంతో చెట్ల మాయం వెనుక సిబ్బంది చేతివాటం ఉందని భావిస్తున్నారు.

ఈ గంధం చెట్ల దొంగతనం పై ఇందిరా పార్క్ మేనేజ్మెంట్ గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ పలు మార్లు ఇలా గంధం చెట్లు మాయం అయ్యాయని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అడుపులోకి కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక గంధపు చెట్ల చోరీ వ్యవహారం మరింత దూరం వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగతనం జరిగిన గంధపు చెట్ల విలువ లక్షా 60 వేల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసింది జిహెచ్ఎంసి.

Read more RELATED
Recommended to you

Latest news