గూగుల్ సెర్చ్‌లో రికార్డు బ్రేక్ చేసిన‌ సన్నీ లియోన్..

-

సన్నీలియోన్.. అసలు పరిచయం అక్కర్లేని పేరు ఈమెది. ఆ పేరు వింటే ఆమె అభిమానుల ఊహలు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో విహరిస్తుంటాయి. ఎప్పటికప్పుడు సంచలన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది సన్నీ. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీల్లో కూడా తనదైన శైలిలో మెప్పిస్తుంది. అయితే సన్నీలియోన్.. గూగుల్, యాహూ వంటి సెర్చ్ ఇంజన్లను సైతం హీటెక్కిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టి ఈ దశాబ్దంలోనే `మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ`గా అగ్రస్థానంలో నిలిచింది. గత పదేళ్ల కాలంలో నెటిజన్లు ఎక్కువగా సన్నీ లియోన్ గురించే శోధించారని ప్రముఖ సెర్చింజన్ యాహూ తాజగా ప్రకటించింది.

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్నీ వరుసగా మూడు సంవత్సరాలపాటు గూగుల్ సెర్చ్‌లో నెం.1 గా నిలిచింది. రెండేళ్లుగా గూగుల్‌లో కాస్త వెనుకపడినా.. యాహూలో మాత్రం ఈ అమ్మడి జోరు కొనసాగుతోంది. 2019లో `మోస్ట్ సెర్చ్‌డ్ ఫిమేల్ సెలబ్రిటీ‌`గా సన్నీ లియోన్‌ తొలి స్థానంలో నిలిచింది. `మోస్ట్ సెర్చ్‌డ్ మేల్ సెలబ్రిటీ‌`గా సల్మాన్‌ఖాన్ నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news