ఏపీలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. చెత్తకుప్పల్లా నగరాలు

-

గత నాలుగు రోజులుగా ఏపీలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో చెత్తను తొలగించకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. దీనికి తోడు ఏపీ భారీగా వర్షాలు కురుస్తుండడంతో చెత్తతో నగరాలన్నీ చిత్తడిగా మారాయి. ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడే పేరుకుపోతున్న చెత్తకుప్పలు.. వాటి నుంచి వెలువడే దుర్గంధంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మార్కెట్లు, దుకాణ సముదాయాల దగ్గరే కాదు ప్రధాన వీధులు, కాలనీల్లోనూ చెత్తకుండీలు నిండిపోయి వ్యర్థాలు ఆ ప్రాంతమంతా నిండిపోయాయి.

Thumbnail image

వాననీరు, గాలులకు ఇదంతా మురుగుకాల్వల్లోకి చేరి ప్రవాహానికి అడ్డుపడుతోంది. కూరగాయలు, పండ్ల మార్కెట్లున్న చోట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నడవడానికి కూడా దారి లేనంతగా చెత్త నిండిపోయిన మార్కెట్లు విశాఖ, విజయవాడ సహా చాలా నగరాల్లో కనిపిస్తున్నాయి. నెలకు రూ.21 వేల వేతనమివ్వాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని నాలుగు రోజులుగా ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. శాశ్వత కార్మికులతో పనులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నా.. పోగయ్యే చెత్తలో పదో శాతం కూడా తొలగించలేకపోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news