ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది కేజీఎఫ్ చాప్టర్-2 మూవీ. ఇందులో కన్నడ నటుడు రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన కేజీఎఫ్ మొదటి భాగం సంచలనాలు సృష్టించింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఒక్క సినిమాతో యశ్ ఏకంగా నేషనల్ స్టార్ గా అవతరించాడు. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్‌గా కేజీఎఫ్-2 వస్తోంది. ఇందులో అన్ని భాషల ప్రముఖ నటులు నటిస్తున్నారు.
ఇక బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇందులో కీలక పాత్ర చేపిస్తున్నారు మూవీటీమ్. దీంతో బాలీవుడ్లో కూడా దీని పై పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఆయన పాత్ర ఎలా ఉంటుందనే అంచానాలకు తగ్గట్టుగానే ఆయన పాత్రను డిజైన్ చేశాడు ప్రశాంత్ నీల్.
కాగా ఈరోజు ఆయన బర్త్‌డే కావడంతో ఈ సందర్భంగా మూవీ టీమ్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో గన్ పట్టుకుని ఎంతో రాయల్‌గా నడుచుకుంటూ వస్తున్న సంజయ్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో ఇదిచూసిన ఆయన అభిమానులు ఎంతగానో సంబుర పడుతున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ ఈ మూవీని బాగానే తెరకెక్కిస్తున్నారు. మరి వారి అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.