‘కేజీఎఫ్ చాప్టర్ 2’ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్..! అదేంటో.. ఎప్పుడో తెలుసా..?

-

అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన ‘కేజీఎఫ్‌‌ చాప్టర్1′ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న’కేజీఎఫ్ చాప్టర్ 2’ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ తెలిపారు. ఈ నెల 29న అరివీర భయంకర అధీర లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు టీమ్ ప్రకటించింది. ఇందులో అధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించగా.. అతడి పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు లుక్ విడుదల కానుంది.

క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళం‌, మ‌ల‌యాళం భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 23న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో చిత్రంలో య‌శ్‌, సంజ‌య్ ద‌త్‌ల మధ్య ఆస‌క్తిక‌ర పోరు ఒక‌టి ఉండ‌నుంద‌ని అంటున్నారు. వచ్చే నెల‌లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు సమాచారం, ఇంకో 25 రోజుల షూటింగ్ మిగిలి ఉంద‌ని తెలుస్తుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప‌లువురు ప్ర‌ముఖులు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news