INDvsSL : టీ20 సిరీస్ నుంచి సంజూ అవుట్..

-

India vs Sri Lanka, 2nd T20I : ఇవాళ శ్రీలంక మరియు టీమిండియా జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ పూణెలోని అంతర్జాతీయ గ్రౌండ్‌ లో జరుగుతోంది. ఇక ఇప్పటికే మొదటి మ్యాచ్‌ లో గెలిచిన టీమిండియా.. రెండో టీ 20 మ్యాచ్‌ లోనూ గెలవాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. టీమిండియా వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ రెండో టీ20 మ్యాచ్‌ కు దూరం కానున్నాడు. మొదటి మ్యాచ్‌ లో ఫీల్డింగ్‌ చేస్తుండగా, సంజూకు గాయం అయింది. దీంతో ఈ మ్యాచ్‌ కే కాకుండా, సిరీస్‌ మొత్తానికి సంజూ దూరం అయ్యాడు. ఇక సంజూ స్థానంలో విదర్భ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. అతను ఐపీఎల్‌ లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున రాణించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news