తెలంగాణ విద్యార్థులకు షాక్..సంక్రాంతి సెలవులు కుదింపు !

-

తెలంగాణ విద్యార్థులకు షాక్. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకులాలకు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులే సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు.

ఈ మేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. ఈనెల 17న కళాశాలలు పునః ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని రకాల పాఠశాలలకు మాత్రం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 13 నుంచి 17 వరకు, ఐదు రోజులు ఉండనున్నాయి. అధికారికంగా మాత్రం ఉత్తర్వులు వెలువడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news