Sardar 2: సర్దార్‌ 2 సెట్‌లో ప్రమాదం.. ఒకరు మృతి

-

Sardar 2 Stuntman Ezhumalai dies after falling from 20 feet on Karthi PS Mithran set: చిత్ర పరిశ్రమలో విషాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది మరణించారు. అయితే.. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం జరిగింది. సర్దార్‌ 2 సెట్‌లో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో స్టంట్‌ మ్యాన్‌ మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్‌ 2 సినిమా సెట్‌లో ప్రమాదం జరిగింది.

Sardar 2 Stuntman Ezhumalai dies after falling from 20 feet on Karthi PS Mithran set

ఫైట్‌ సీన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న స్టంట్‌ మ్యాన్‌ ఎజుమలై ప్రమాదవశాత్తూ 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. చిత్రబృందం అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించింది. ఎజుమలైకి ఛాతీ భాగంలో తీవ్ర గాయమైంది ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో మృతిచెందాడు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్తీ హీరోగా 2022లో సర్దార్‌ చిత్రం తెరకెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news