అదరగొడుతున్న సర్కార్ వారి ‘పాట‘… కళావతి సాంగ్ కు రికార్డ్ వ్యూస్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తరువాత మహేష్ సినిమా వస్తుండటంతో.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్లో మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. పరుశురామ్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ‘కళావతి’ సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మహేష్ బాబు, హీరోయిన్ కీర్తిసురేష్ పై ఈ సాంగ్ చిత్రీకరించారు. ఈసాంగ్ లో మహేష్ బాబు- కీర్తి సురేష్ పెయిర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాగా ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. విడుదలైన ఒక్క రోజులోనే 70 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇందులో 50K మంది లైక్స్ కొట్టారు. సిడ్ శ్రీరాం సూపర్ వాయిస్, తమన్ మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేశాయి.  ఇక సినిమా విడుదలైతే మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో అని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news