మళ్ళీ మొదలైంది: కేసీఆర్‌ వన్ మ్యాన్ షో..?

-

సరిగ్గా 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల ముందు ఒక్కసారి కేసీఆర్ ఎలాంటి రాజకీయాలని చేశారో గుర్తు చేసుకుంటే…సేమ్ ఇప్పుడు అలాంటి రాజకీయాలే చేస్తున్నారని చెప్పొచ్చు. రాజకీయంగా మరోసారి సక్సెస్ అయ్యి..మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు. ఒకసారి 2018 ఎన్నికలకు ముందు ఎలాంటి రాజకీయం చేశారో ఒకసారి మాట్లాడుకుంటే…అప్పుడు కూడా మోదీ ప్రభుత్వంపై యుద్ధమే అన్నట్లు హడావిడి చేశారు. అలాగే దేశంలోని విపక్ష పార్టీలని ఏకం చేసి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని దేశమంతా తిరిగేశారు. అసలు కేంద్ర ప్రభుత్వం…బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మినహా మిగిలిన రాష్ట్రాలని పట్టించుకోవడం లేదని ఫైర్ అయిపోయారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

అంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతని పక్కదారి పట్టిస్తూ కేవలం తన చుట్టూనే రాజకీయం నడిచేలా చేసుకున్నారు. అప్పటివరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ప్రజలు ఎక్కడకక్కడ నిలదీసే పరిస్తితి ఉంది..కానీ కేసీఆర్ వన్ మ్యాన్ షోతో మొత్తం రాజకీయం మారింది. ఇక 2018 ఎన్నికల సమయంలో చంద్రబాబు రూపంలో కేసీఆర్‌కు ఒక రాజకీయ అస్త్రం దొరికింది. ఇక చంద్రబాబుని తెలంగాణ శత్రువుగా ప్రచారం చేసి ఎన్నికల్లో కేసీఆర్ లబ్ది పొందారు…మళ్ళీ టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

అయితే ఇప్పుడు కేసీఆర్ ఫోకస్ 2023 ఎన్నికలపై పెట్టారు…ఆ ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పుడు తాము చేసిన పనులని చెప్పుకుని గెలవడం కష్టం..పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో మళ్ళీ కేసీఆర్ తన వన్ మ్యాన్ షో పెట్టారు. రాజకీయమంతా తన చుట్టూనే తిరిగేలా చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలాగే మళ్ళీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తానని, మోదీని ఓడిస్తామని చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలకు మోదీని ఒక శత్రువు మాదిరిగా చూపించే ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే మళ్ళీ ఎన్నికల్లో సక్సెస్ అవ్వడానికి కేసీఆర్ ఈ ప్లాన్ చేశారని తెలుస్తోంది..మరి ఈ సారి కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news