Sarkaru Vari Paata : సెంచ‌రీ కొట్టేసిన మ‌హేశ్ బాబు క‌ళావ‌తి సాంగ్

-

ప్రిన్స్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా న‌టిస్తున్న సినిమా స‌ర్కారు వారి పాట‌. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్, మ‌హేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగ ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల విడుద‌ల వాయిదా ప‌డింది. కాగ ఈ సినిమాను వేస‌వి కానుక‌గా.. ఈ ఏడాది మే12 న థీయేట‌ర్స్ ల‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

కాగ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర బృందం విడుద‌ల చేసిన పోస్ట‌ర్లకు, సాంగ్స్ ల‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది. అలాగే ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన క‌ళావ‌తి అనే పాట కూడా భారీ స్పంద‌న వ‌చ్చింది. అంతే కాకుండా ఈ పాట‌తో స‌ర్కారు వారి పాట సినిమా విడుద‌లకు ముందే.. రికార్డుల‌ను సృష్టిస్తుంది. ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్ లో సంచ‌ల‌నాలను సృష్టిస్తుంది.

ఈ పాట విడుద‌ల అతి త‌క్కువ సమ‌యంలోనే 100 మిలియ‌న్స్ పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ పాట‌ను విడుద‌ల చేసిన మొద‌టి రోజు నుంచే భారీ స్పంద‌న వ‌చ్చింది. ఈ పాట‌లో మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్ వేసిన క్యూట్ స్టెప్పులు ఆక‌ట్టుకున్నాయి. కాగ ఈ పాట‌లో అనంత్ శ్రీ‌రామ్ సాహిత్యంతో, సిద్ శ్రీ‌రామ్ గొంతు తో సూప‌ర్ అనిపించారు. కాగ ఈ సినిమాకూ ఎస్ ఎస్ థ‌మ‌న్ మ్చూజిక్ అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news