ఏపీ సీఎం జగన్ కి సర్పంచ్ అభ్యర్ది లేఖ.. ఇక చావే శరణ్యం !

Join Our Community
follow manalokam on social media

మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసిన ఒక సర్పంచ్ అభ్యర్థి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది. సీఎం జగన్ కు కర్నూలు జిల్లా దేవనకొండ సర్పంచ్ అభ్యర్థి గీత లేఖ రాశారు. తనను వైసీపీ నుంచి పోటీ చేయించి వైసీపీ నేతలు మోసం చేశారని ఆమె లేఖలో ఆరోపించారు.


ఖర్చు అంతా తనతో పెట్టించి చివరికి ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆమె ఆరోపించారు. పొలం తాకట్టు పెట్టి మరి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అని తమను ఆదుకోవాలని, లేక పోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ గ్రామం కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం కిందకు వస్తుందని తెలుస్తోంది. ఏకంగా సీఎం జగన్ కు లేఖ రాయడంతో ఆయన ఈ లేఖకు ఎలా స్పందిస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...