వావ్‌.. వాటెన్‌ ఐడియా సర్‌జీ.. పంచాయతీ ట్రాక్టర్‌ అమ్మకానికి పెట్టిన సర్పంచ్‌..

ఓ సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిచాడు.. దీంతో ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయికదా అని బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకువచ్చి మరీ.. గ్రామంలో పనులు వేశాడు. తీరా చూస్తే.. ఈఎంఐలు కట్టడానికి సొంత జేబులు చిల్లవుతున్నాయి. దీంతో.. ఈఎంఐలు కట్టలేక గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను సర్పంచ్ అమ్మకానికి పెట్టారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కిస్తీలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ రాధ చెబుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కువానిపల్లెలో ఈ ఘటన జరిగింది.

Mahindra 415 DI, 40 hp Tractor, 1500 kg, Price from Rs.270000/unit onwards,  specification and features

తొమ్మిది నెలలుగా గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదని సర్పంచ్ రాధ తెలిపారు. నెలనెలా ఠంచనుగా ఈఎంఐలు కట్టడానికి చాలా ఇబ్బందిపడుతున్నామని.. గత్యంతరం లేకనే సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టామన్నారు. EMI కట్టలేకనే అమ్మకానికి పెడుతున్నట్లు సోషల్ మీడియాలో పెట్టామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని సర్పంచ్ రాధ కోరారు.