మరోసారి పెళ్లిపై అలాంటి కామెంట్లు చేసిన తమన్నా.. ఖాయమేనా..?

-

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక స్టార్ హీరోయిన్గా తన కెరీర్ ను కొనసాగిస్తున్న ఈమె ఒకపక్క పెద్ద బడ్జెట్ సినిమాలు పెద్ద హీరోల పక్కన చేస్తున్నా.. ఇంకో పక్క చిన్న హీరో సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా సత్యదేవ్ లాంటి చిన్న నటుడు పక్కన నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది తమన్నా.. ఈ క్రమంలోనే ఈమె నటించిన తాజా చిత్రం” గుర్తుందా శీతాకాలం” ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో సత్యదేవ్, మేఘన , ఆకాష్, కావ్య శెట్టి కూడా తమన్నా తో పాటు నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా విడుదల సందర్భంగా ఆ చిత్ర విశేషాలను విలేకరులతో ముచ్చటించడం జరిగింది…

- Advertisement -

ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి గురించి కూడా చెప్పేసింది తమన్నా.. అలాగే సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. మిగతా సినిమాలతో పోల్చితే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే.. కానీ ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్ క్యారెక్టర్రైజేషన్ ఆకట్టుకుంటాయి అని తెలిపింది. ఈ సినిమా కథలో కథానాయకుడు చిన్నప్పటినుంచి వయసుకు వచ్చేవరకు తన జీవితంలో వచ్చిన ముగ్గురు కథానాయకుల గురించి ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి తెలుగులో.. మరి ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటి అంటే.. సినిమాను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఆ కొత్త ఎమోషన్స్ కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాము.

సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది. ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లెప్పుడు చేసుకుంటారు అని కొంతమంది అడగగా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. కానీ నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే ముందుగా మీతోనే ఆ విషయాన్ని పంచుకుంటాను అంటూ తెలిపింది తమన్నా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...