కరోనా వైరస్‌పై నిత్యానందస్వామి సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్‌పై నిత్యానందస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కరోనా మరణాలు మరింత పెరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. కరోనా వైరస్ తన వల్లే తగ్గుతుందని, ఎప్పుడైతే తాను భారత్‌లో అడుగుపెడతానో అప్పుడే వైరస్ తగ్గిపోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను స్వయంగా శివలింగాలకు ప్రత్యేక జలాభిషేకం చేశానని. ఆ నీళ్లు తాగితే కరోనా వైరస్ తగ్గి పోతుందని తెలిపారు. తనను బహిష్కరించినా..  తనకు దేశం కావాలని చెప్పారు. తన భక్తులను తానే కాపాడుకుంటానని పేర్కొన్నారు.

కాగా సత్యానందస్వామి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయారు. అక్కడ ప్రత్యేకంగా ఓ దివిని కోనుగోలు చేసి కైలాస అనే పెరు పెట్టారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నారు. ఈ కైలాస దేశానికి పాస్​ పోర్ట్​, జెండా, జాతీయ చిహ్నాం , కేబినేట్​ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.