గురుకుల స్కూల్స్‌లో 5వ తరగతి ప్రవేశాలు!

-

గురుకుల స్కూల్స్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడదలైంది. ఇప్పటికే ఆన్‌ లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్‌ 30 చివరి తేదీగా నిర్ధారించారు. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను , దరఖాస్తును విద్యార్థులు https://aprs.apcfss.in వెబ్‌ సైట్‌లో చేసుకోవచ్చు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని గురుకుల విద్యాలయాల ప్రవేశాలకు కోసం విడుదల చేశారు.

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ, 12 మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంస్థ కార్యదర్శి ఎంఆర్‌ ప్రసన్న కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా విద్యార్థులు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లాల వారీగా కలెక్టర్‌ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేస్తారు.

గురుకుల ప్రవేశాలకు సంబంధించిన అర్హతలు.. ఓసీ, బీసీ లకు చెందిన విద్యార్థులు 2010 సెప్టెంబర్‌ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టిన వారై ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలు 2008 సెప్టెంబర్‌ 1 – 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి.
గురుకులాల్లో ప్రవేశాలు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆయా జిల్లాల్లో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో రెగ్యూలర్‌గా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 3, 4 తరగతులు చదివి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివినా ఈ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులే. కానీ,ఓసీ, బీసీ విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోనే చదవి ఉండాలి. ఇంకా ఈ ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష మించకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news