తెలంగాణలో పెరుగుతున్న భూగర్భ జలాలు.. దేశంలోనే ప్రథమ స్థానం..

వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాలను తాకుతున్నాయి. దాంతో రాష్ట్రంలో వర్ష సూచన మొదలైంది. జూన్ మొదటి వారంలోనే వర్షాల తాకిడి రాష్ట్రానికి తగిలింది. చిన్న, మోస్తారు వర్షాలతోపాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష సూచన బాగుండడంతో తెలంగాణలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్ళలో భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఐదేళ్ళలో 3మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

 

ఈ ఏడాది కూడా వర్షాభావం బాగుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల భూగర్భ జలాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 3మీటర్ల భూగర్భ జలాల పెరుగుదలతో దేశంలోనే అత్యధిక భూగర్భ జలాలు పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. కరోనా బారిన పడి అతలాకుతలం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించి వర్షాలు వర్షాలు కురవడం కొంత ఉపశమనం అని అంటున్నారు.