నెల నెలా పొదుపు చేసి రూ.16 లక్షలు పొందండి ఇలా…!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన ప్రజలకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్ట్ ఆఫిస్ అప్డేట్ అవుతూ సరి కొత్త సేవలని ఇస్తోంది. ఇక్కడ డబ్బులు పెడితే భద్రత తో పాటు మంచి రాబడి కూడా ఉంటుంది. అయితే అన్ని స్కీమ్​లలో రికరింగ్​ డిపాజిట్​ స్కీమ్​ అత్యంత ప్రాచుర్యం పొందింది.

 

indian post
indian post

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ స్కీమ్​లో పెట్టుబడి ద్వారా మీ రాబడికి హామీ ఉంటుంది. ఇందులో మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో జమ చేసుకోవచ్చు. దీనిలో మీరు రూ .100 నుంచి కూడా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. గరిష్ట పరిమితి ఏం లేదు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఐదేళ్ల పాటు తెరవవచ్చు. డిపాజిట్ చేసిన డబ్బు పై ప్రతి త్రైమాసికానికి వడ్డీ జమ అవుతుంది.

ఇక ఎంత వడ్డీ వస్తుంది అనేది చూస్తే.. రికరింగ్ డిపాజిట్ పథకం 5.8% వడ్డీని అందిస్తుంది. ఈ కొత్త వడ్డీ రేటు 2020 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. ప్రతీ మూడు నెలలకి వడ్డీ రేట్లు మారతాయి. ఈ స్కీమ్​లో మీరు ప్రతి నెలా రూ .10 వేల చొప్పున ఇన్వెస్ట్​ చేస్తే పది సంవత్సరాల తర్వాత మీకు మొత్తం రూ. 16 లక్షలు వస్తాయి. ప్రతీ నెలా సమయానికి డిపాజిట్ చెయ్యాలి. లేకపోతే పెనాల్టీ చెల్లించాలి. వరుసగా నాలుగు నెలల పాటు డబ్బులు జమ చేయకపోతే అకౌంట్‌ను మూసివేస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news