ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కొన్ని మార్పులు చేయడం తో అకౌంట్ హోల్డర్స్ కి ఊరట కలిగించింది. పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు డబ్బులు విత్ డ్రా చేసే లిమిట్ ని పెంచింది. సేవింగ్ స్కీమ్స్ నుండి డబ్బులు విత్ డ్రా చేసే లిమిట్ ని పెంచడం జరిగింది. ఇలాంటి పలు మార్పులను చూస్తే పోస్ట్ ఆఫీస్ కూడా బ్యాంకులకు ధీటుగా సేవలను అందించే లాగ ఉంది.
ఇది ఇలా ఉంటే రూరల్ పోస్టల్ సర్వీస్ నుండి అకౌంట్ హోల్డర్స్ రూ. 20,000 ఒక రోజులో తీసుకోవచ్చు. అయితే గతం లో ఈ లిమిట్ రూ 5 వేలు మాత్రమే ఉండేది. ఇదిలా ఉంటే ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయినా యాభై వేలు రూపాయలు కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయడానికి వీలు లేదు. కొత్త రూల్స్ ప్రకారం సేవింగ్స్ అకౌంట్ తప్పించి మిగిలిన అకౌంట్లు కలిగిన వాళ్ళు, టీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీం, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్, యాక్సెప్టెన్స్ లేదా విత్ డ్రా ఫామ్ ద్వారా చేసుకోవచ్చు.
అలానే మినిమం బ్యాలెన్స్ విషయానికి వస్తే… పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ లో మీకు నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది. అయితే 500 రూపాయలు మినిమమ్ బ్యాలెన్స్ ని ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఒకవేళ కనుక లేనట్టు అయితే వంద రూపాయలు మెయింటెనెన్స్ ఫీజ్ కింద కట్ అయిపోతాయి.
పోస్ట్ ఆఫీస్ ప్లాన్స్
– పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్
– 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ పునరావృత డిపాజిట్ ఖాతా
– పోస్ట్ ఆఫీస్ స్థిర డిపాజిట్ ఖాతా
– పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఆదాయ పథకం ఖాతా
– సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
– 15 సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్
– సుకన్య సమృద్ది స్కీమ్
– జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం
– కిసాన్ వికాస్
పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలపై ఇంట్రెస్ట్
పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా 4.0
1 సంవత్సరం టిడి ఖాతా 5.5
2 సంవత్సరాల టిడి ఖాతా 5.5
5 సంవత్సరాల టిడి ఖాతా 6.7
5 సంవత్సరాల RD 5.8
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 7.4
పిపిఎఫ్ 7.1
కిసాన్ వికాస్ 6.9
సుకన్య సమృద్ది ఖాతా 7.6