చాలా మంది ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటారు. అటువంటి వాళ్ళు బరువు తగ్గాలనుకుంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. వీటిని కనుక తీసుకున్నారంటే ఖచ్చితంగా బరువు తగ్గొచ్చు. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు బరువు తగ్గడం మంచిది.
బరువుని తగ్గించే ఆహార పదార్థాలు:
కిడ్నీ బీన్స్:
కిడ్నీ బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐరన్, ఫోలేట్, కాపర్, విటమిన్ కె, మాంగనీస్ కూడా దీనిలో ఎక్కువగా ఉంటాయి. వర్క్ ఔట్ చేసిన తర్వాత వీటిని తీసుకుంటే బరువు బాగా తగ్గడానికి ఉపయోగపడుతుంది.
అరటి పండ్లు:
అరటి పండ్లు కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఇది మనకి సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏ చింత అవసరం లేదు. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ గా దీనిని తీసుకుంటే జీర్ణ శక్తి పెరగడంతో పాటు గుండెకు కూడా మేలు కలుగుతుంది. అయితే బరువు తగ్గడానికి అరటిపండు కూడా బాగా ఉపయోగపడుతుంది గమనించండి.
కొబ్బరి నీళ్ళు:
కొబ్బరి నీళ్ళు కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు బాగా మేలు చేస్తాయి.
చిలకడ దుంపలు:
బరువు తగ్గడానికి చిలకడదుంపలు కూడా బాగా పనిచేస్తాయి. చిలకడ దుంప లో ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి 6, విటమిన్ ఏ ఉంటాయి. బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే పాలకూర, బచ్చలి కూర కూడా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.