కరోనా కారణంగా గతేడాది ఇంటర్ విద్యార్థులకు సిలబస్ ను 30 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా సిలబస్ ను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రం లో ఈ విద్యాసంవత్సరం 2021-22 కూడా ఇంటర్ సిలబస్ 70 శాతమే ఉండనుంది. ఈ మేరకు సిలబస్ ను తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది.
రాష్ట్రాలు కూడా కేంద్రం ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా విడుదల విడుదల చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. కాబట్టి సిలబస్ మొత్తం పరీక్షల్లో ఇస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయం తో విద్యార్థులపై కూడా భారం తగ్గనుంది.