ఇలా చేస్తే వేసవి కాలంలో ఎంత ఎక్కువ వాడినా.. కరంట్ బిల్లు తక్కువే వస్తుంది..!

-

వేసవిలో చాలా శాతం మంది ఎండ తీవ్రతను తట్టుకోలేక ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరగడం వలన ఏసీ ఉపయోగం కూడా చాలా ఎక్కువ అయింది అనే చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆఫీసుల లో కూడా ఏసీ వినియోగం ఎక్కువైంది. దీంతో విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తోంది. అయితే ఏసీ బిల్లును తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎండ తీవ్రత పెరగడం వలన ఏసీ వాడకం తప్పనిసరి అయిపోయింది అనే చెప్పవచ్చు. ఎక్కువసేపు ఏసీ ఉపయోగించిన తక్కువ విద్యుత్ బిల్లు రావాలంటే ఇలా చేయండి. ఎప్పుడైతే ఏసీ ను వినియోగిస్తారో ఆ సమయంలో స్టాండ్ ఫ్యాన్ లేక సీలింగ్ ఫ్యాన్ ను ఆన్ చేయండి.

ఇలా చేయడం వలన గాలి సమానంగా ఉంటుంది మరియు ఏసీ పని భారం కూడా తగ్గుతుంది. చాలా శాతం మంది ఏసీ ను ఆన్ చేసి మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా బయటకు వెళ్లే ముందు లేక అవసరం లేనప్పుడు ఏసీను తప్పకుండా ఆఫ్ చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోతున్నట్లయితే రిమోట్ టైమర్ ను సెట్ చేసుకోండి. స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఏసీ ను ఆఫ్ చేయడం లేక టైమర్ ను సెట్ చేయడం వంటివి చేయాలి. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చాలా మంది ఎంతో తక్కువ ఉష్ణోగ్రతకు ఏసీ ను సెట్ చేస్తారు.

కాకపోతే ఆదా చేయాలంటే 24 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత పెట్టకూడదు. కనుక మీ ఏసీ ని 24 నుండి 26 డిగ్రీల వరకు సెట్ చేయండి. అదే విధంగా ఇంటి లోపలికి లేక గదిలోకి సూర్యకాంతి వస్తున్నట్లయితే కర్టెన్లు లేక బ్లైండ్ల ను ఉపయోగించండి మరియు గదిలో ఉండే చల్లని గాలి బయటకు వెళ్లకుండా కిటికీలు, తలుపులు మధ్య ఉండేటువంటి ఖాళీలను కూడా మూసివేయండి. ఇలా చేయడం వలన గది ఎంతో చల్లగా ఉంటుంది మరియు కొద్ది సమయానికే మీరు ఏసీ ని కూడా ఆఫ్ చేయవచ్చు. దీంతో విద్యుత్ బిల్లును కూడా తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news