సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో మొబైల్ నంబర్‌ను లింక్ చెయ్యాలా…? అయితే ఇలా చెయ్యండి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలగనుంది. మీరు స్టేట్ బ్యాంక్ కస్టమర్ యేనా..? మీ మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయలేదా..? అయితే వెంటనే లింక్ చేయండి.

లింక్ చేసేందుకు ఇతరుల సహాయం అక్కర్లేదు. ఈజీగా మీరు లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా లింక్ చేసుకోవాలి అనే స్టెప్స్ వున్నాయి. మరి ఫాలో అయ్యిపోయి ఈజీగా లింక్ చెయ్యండి. మీ స్టేట్ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ప్రతి సమాచారం ని పొందాలంటే ఫోన్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి.

దీని కోసం మొదట మీరు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ కి లాగిన్ అవ్వండి .
ఆ తర్వాత చేంజ్ ప్రొఫైల్, పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ మీద క్లిక్ చేయండి
ఇప్పుడు ఎడమ ప్యానెల్‌లో కనిపించే నా ఖాతాల పై క్లిక్ చేయండి.
మీ అకౌంట్ నెంబర్ ని ఎంపిక చేసుకుని.. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
నమోదిత మొబైల్ నంబర్ చివరి 2 అంకెలు మీకు కనపడతాయి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ లో లింక్ స్థితి తెలుస్తుంది.
లేదంటే మీరు నేరుగా బ్యాంకు కి వెళ్లి దరఖాస్తు ఫారమ్ నింపండి. అవసరమైన పత్రాలను ఇచ్చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news