వృద్దులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.20,000 పొందే ఛాన్స్..!

-

సీనియర్ సిటిజన్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌ లో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని డబుల్ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023 సందర్భంగా ఈ విషయాన్నీ చెప్పారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో ప్రస్తుతం రూ.15 లక్షల మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు ఛాన్స్ వుంది.

కానీ ఈరోజు నుండి 2023 ఏప్రిల్ 1 నుంచి రూ.30 లక్షల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో వృద్ధులకు ఎంతో మేలు కలగనుంది. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ప్రతీ నెలా పెన్షన్ ని పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వారు ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో కొంత ఆదాయాన్ని ప్రతీ నెలా పొందుతారు. 2004లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌ను ప్రారంభించింది కేంద్రం.

ఈ స్కీమ్ లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి 8 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లు ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టచ్చు. ఐదేళ్లకు రూ.6,00,000 వడ్డీ వస్తుంది. ప్రతీ నెలా అకౌంట్‌లో రూ.10,000 చొప్పున పడతాయి. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు ఇది పెన్షన్‌లా ఉపయోగ పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వుంది. గరిష్టంగా రూ.1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ప్రతీ మూడు నెలలకు ఒక సారి వడ్డీ రేట్లను మారుస్తూ వుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news