తన సమాధిపై అలాంటి వాక్యాలు రాయమని చెప్పిన సావిత్రి.. కారణం..?

-

మహానటి సావిత్రి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె పేరుకు మాత్రమే సావిత్రి కాదు నిజ జీవితంలో కూడా సావిత్రి అంత పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు , తమిళ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.. అంతేకాదు ఎంతోమంది ప్రజలు ఆరాధ్య దైవంగా నిలిచిన సావిత్రి ఏ రోజు కూడా అవార్డులను సొంతం చేసుకోకపోవడం గమనార్హం. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు కాదు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఈమెను చేరలేదు. ముఖ్యంగా రఘుపతి వెంకయ్య పురస్కారానికి అసలుకే నోచుకోలేదు. ఇకపోతే ఈ పురస్కారాలన్నింటికీ అతీతమైనది మహానటి సావిత్రి అని చెప్పవచ్చు.

గత 100 సంవత్సరాలలో అత్యుత్తమ భారతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఆమె గురించి మాట్లాడుతూ సావిత్రితో నటించడం అంటే ఒక గొప్ప అనుభవం.. ఒక్కోసారి ఆమెను మనం అందుకోగలమా అని భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అని ఆయన తెలిపారు. ఇక ఎన్టీఆర్, శివాజీ గణేషన్ లాంటివారు మాత్రమే కాకుండా గొప్ప నటులైన ఎస్వీ రంగారావు లాంటి వారు కూడా సావిత్రితో నటించేటప్పుడు ఆచితూచి అడుగులు వేసేవారు. ఇక ఆమె చివరి వరకు మహానటి అనే బిరుదును తప్ప ఏది శాశ్వతం చేసుకోలేకపోయింది. ఇకపోతే చివరిగా 1960లో ఉత్తమ తెలుగు సినిమాగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్న “చివరకు మిగిలేది” అనే సినిమాలో నటించింది.

ఇక ఇలా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమెకి చనిపోయేటప్పుడు ఒక కోరిక ఉండేదట. ఇక అదేమిటంటే నా సమాధిపై నిలిపే సంస్మరణ ఫలకం మీద చెక్కే చివరి వాక్యాలు ఇలా ఉండాలి.. జీవితంలోనూ .. మరణం లోనూ.. మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతున్నది. ఎవరు ఇక్కడ సానుభూతితో వేడి కన్నీటిబొట్లను విడవనక్కర్లేదు. ఇక సమాజ దృష్టిలో ఏ తార కూడా హీనంగా చూడకుండా ఇక్కడ నిద్రిస్తున్న మరణం లేని మహా ప్రతిభకు మృతి చిహ్నంగా ఒక చిన్న పూల మూలికను ఉంచండి. అది చాలు అని అప్పుడు సావిత్రి అన్నారట. ఇదే విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news