ఎస్‌బీఐ అకౌంట్ ని ఆన్‌లైన్‌లోనే వేరే బ్రాంచ్‌కు ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసేయచ్చు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. మీకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ వుందా..? ఒక బ్రాంచ్‌లో ఉన్న మీ సేవింగ్స్ అకౌంట్‌ను ఇంకొక బ్రాంచ్ కి మార్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా ఈజీగా మార్చుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం వంటివి ఏమి చెయ్యక్కర్లేదు. ఈజీగా ఇంట్లో వుండే మార్చుకోవచ్చు. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఆన్‌లైన్‌ లోనే మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

దీని కోసం ముందు ఎస్‌బీఐ అకౌంట్ హోల్డర్స్ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయ్యాక పర్సనల్ బ్యాంకింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఇ-సర్వీస్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి.
ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే.. ఏ అకౌంట్ ని మార్చాలంటే దాని నెంబర్ ని ఎంటర్ చెయ్యండి.
బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ని కూడా ఎంటర్ చెయ్యండి.
ఇప్పుడు కన్ఫామ్ బటన్ పైన క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసేస్తే చాలు.
కావాలంటే యోనో యాప్ ద్వారా కూడా మార్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news