ఆరోగ్య ప్రియులపై ఎస్‌బీఐ కార్డు గుడ్ న్యూస్.. SBI కార్డ్‌ పల్స్ ఆవిష్కరణ..!

-

ప్యూర్‌ ప్లే క్రెడిట్‌ కార్డ్‌ జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌ ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్ ఆవిష్కరించింది. ఈ కార్డ్ ని కస్టమర్ల ఆరోగ్యం, క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ఫీచర్లతో తీసుకు రావడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. జాయినింగ్‌ ఫీజు చెల్లించిన తర్వాత స్వాగత కానుకగా రూ.4,999 విలువ చేసే నాయిస్‌ కలర్‌ఫిట్‌ పల్స్ స్మార్ట్‌ వాచ్‌ను మొట్టమొదటి సారిగా ఎస్‌బీఐ పల్స్‌ ఇస్తోంది.

ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ప్రయత్నం చేస్తున్నారు. అది వారి జీవితంలోనూ ప్రతిబింబిస్తోంది. ఆహారం, ఫ్యాషన్‌, వినోద కార్యకలాపాలు లేదా జీవనశైలి అంశాల్లో అది కనిపిస్తోంది. అయితే ఫిట్‌నెస్‌ ఆకాంక్షలకు చేయూత అందించడం ఎస్‌బీఐ పల్స్ కార్డ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక దీని గురించి ఎస్‌బీఐ కార్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలనే చైతన్యం బాగా పెరిగింది, ఆ భావనకు కొవిడ్‌-19 నిస్సందేహంగా తోడ్పాటు అందించింది అన్నారు. పైగా దీనిని ఎంతో ఆలోచించి తీసుకొచ్చాము అని అన్నారు. ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌ విషయంలో పెరుగుతున్న మా కస్టమర్ల అవసరాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వారి ఆకాంక్షలకు తగినట్టుగా ఈ ప్రత్యేకమైన కార్డ్ ఉంటుంది అన్నారు.

1.4 ఇంచుల ఫుల్‌ కలర్‌ డిస్‌ప్లే, బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్ (SPO2), స్లీప్‌ మానిటరింగ్‌ వంటి గ్రేట్ ఫీచర్స్ దీనిలో వున్నాయి. అలానే ఒక సంవత్సరం ఫిట్‌పాస్‌ ప్రో సభ్యత్వాన్ని ఈ కార్డు అందిస్తుంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న 4000 ప్లస్‌ జిమ్స్, ఫిట్‌నెస్‌ స్టూడియోలకు దీని ద్వారా కస్టమర్లకు యాక్సెస్‌ లభిస్తుంది. అలానే యోగా, డ్యాన్స్, కార్డియో, పిలేట్ ఇంకా అనేక ఆన్‌లైన్‌ ఫిట్‌నెస్‌ సెషన్లను కూడా దీనితో పొందొచ్చు.

అలానే ఒక సంవత్సరం నెట్‌మెడ్స్‌ ఫస్ట్ మెంబర్‌షిప్‌ పొందుతారు. ఆన్‌లైన్‌ డాక్టర్‌ కన్సల్టెషన్లతో పాటు వార్షిక ప్రాథమిక హెల్త్ చెకప్‌, పాథాలజీ ల్యాబ్‌ టెస్టులపై 5% అదనపు తగ్గింపు సహ అపరిమితమైన ఉచిత, ప్రయారిటీ డెలివరీ కూడా. ఈ కాంటాక్ట్‌ లెస్‌ కార్డు వార్షిక మెంబర్‌షిప్‌ ఫీజు రూ.1499 మాత్రమే. అంతే కాదు కార్డు సభ్యత్వ సంవత్సరంలో రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు అయితే రూ.1500 విలువైన నెట్‌మెడ్‌ ఈ-వౌటర్‌ అందుకుంటారు.

సంవత్సరంలో 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్‌ లాంజ్‌ విజిట్స్, $99 విలువైన కాంప్లిమెంటరీ ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌, కాంప్లిమెంటరీ గ్రూప్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్, కాంప్లిమెంటరీ ఫ్రాడ్‌ లయబిలిటి కవర్‌, కాంప్లిమెంటరీ ఎయిర్‌ యాక్సిడెంట్‌ కవర్ కూడా ఉన్నాయి. డైనింగ్‌, సినిమాలపై జరిపే కొనుగోళ్లకు 5X రివార్డు పాయింట్లను పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news