తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌ ధరలు… ఇక నుండి రూ. 149కే మొదలు…!

-

ఓటీటీ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ నెలవారి సభ్యత్వ రుసుముని తగ్గించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చార్జీలని 60 శాతం వరకూ తగ్గించడం జరిగింది.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్ నెల వారి సభ్యత్వానికి రూ.199 చెల్లించాల్సి ఉండగా ఇక నుండి 149 చెల్లిస్తే సరిపోతుంది. అలానే 499 రూపాయలు నెలకి కట్టాల్సినది కాస్తా ఇప్పుడు 199 రూపాయలు కడితే సరిపోతుంది. అలానే స్టాండర్డ్‌ ప్లాన్‌కు రూ.499, ప్రీమియం ప్లాన్‌కు రూ.649 చెల్లిస్తే సరిపోతుంది.

ముందు మాత్రం రూ. 649, రూ. 799 వద్ద ఉండేవి. కరోనా సమయంలో సబ్స్క్రిప్షన్ రేట్లు భారీగా పెరిగాయి కానీ ఇప్పుడు మళ్ళీ తగ్గాయి. వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు గత కొంత కాలంగా విశేష ఆదరణ లభిస్తోంది. కరోనా వచ్చినప్పటి నుండి కూడా వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌లు భారీగా పెరిగాయి.

ఇది ఇలా ఉంటే అమెజాన్‌ ప్రైమ్ సభ్యత్వ రుసుము మాత్రం మరెంత పెరిగింది. ఇకపై 50శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సభ్యత్వం రూ.999 ఉండగా రూ.1,499 గా మారుస్తున్నట్టు చెప్పింది. ప్రస్తుతం నెలవారీ సభ్యత్వ రుసుము కంటే 38 శాతం అదనం ఇక నుండి చెల్లించాలి. రూ.129గా ప్రస్తుతాం ఉండగా, రూ.179 గా మారింది. అదే మూడు నెలలకు రూ.329 ఉండేది కాస్తా రూ.459 అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news