సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేలకు సిరీసుకు దూరం కానున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు తనన దక్షిణాఫ్రికా టూర్‌కు దూరంగా ఉంచాలని కోహ్లీ బీసీసీఐని కోరినట్లు తెలుస్తున్నది. అయితే, కోహ్లీ కోరికను బీసీసీఐ మన్నిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉన్నది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా అతణ్ని తప్పించడం గమనార్హం.

మరోవైపు తొడ కండరాల పట్టేయడంతో సౌతాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్ సిరీస్‌కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో గుజరాత్ ఓపెనర్, టీమిండియా ఏ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పంచాల్‌ను ఎంపిక చేసింది. అయితే, మూడు వన్డేల సిరీస్‌ వరకు అతడు కోలుకొని జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.